: మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో మ్యాన్ హోల్ లో పడి నలుగురు కార్మికుల మృతి


హైదరాబాదులోని హైటెక్ సిటీ సమీపంలోని మాదాపూర్, అయ్యప్ప సొసైటీలో విషాదం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలోని మ్యాన్ హోల్ లో పడి నలుగురు కార్మికులు మృతి చెందారు. ఈ మ్యాన్ హోల్ 25 అడుగుల లోతు ఉందని, ఒకరిని రక్షించేందుకు ఒకరు ప్రయత్నించడం కారణంగా ఈ నలుగురు కార్మికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ మ్యాన్ హోల్ లో విషవాయువుల కారణంగా వారు మృతి చెందినట్టు అధికారులు భావిస్తున్నారు. అధికారులు ఈ నలుగురి మృతదేహాలను బయటకు తీసే చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News