: మోదీ, ఒబామాపై మంత్రి ఆజంఖాన్ సంచలన వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా అమెరికాలోని లాస్‌ఏంజిల్స్ ఎయిర్‌పోర్టులో షారుఖ్ ఖాన్‌ని అడ్డుకోవడంపై ఆయన స్పందించారు. ముస్లింల పట్ల భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా వ్యతిరేఖ ధోరణి కనబరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత్‌లో ముస్లింలు ప్రశాంతంగా బతికేందుకు మోదీ అనుమతించడం లేదని, మరోవైపు అమెరికాలోనూ ముస్లింలు నివసించడాన్ని ఒబామా వ్యతిరేకిస్తున్నారని ఆజంఖాన్ అన్నారు. మోదీ, ఒబామాలు స్నేహితులని ఆయన అభివర్ణించారు. వారిద్దరు ఇలా ప్రవర్తిస్తుండడంతో ముస్లింలు ఏ ప్రాంతానికి వెళ్లాలో తెలియక బాధపడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.