: భూమి ఇమ్మంటూ తుపాకి గురిపెట్టి, నయీమ్ అనుచరులు బెదిరించారని బాధితుల ఫిర్యాదు
పాపాలు పండి పోలీసుల చేతిలో ఇటీవల హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్, అతడి అనుచరుల ఆగడాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వారి బాధితులు పోలీస్‌స్టేషన్‌లకి క్యూ కడుతున్నారు. వారి ఆగడాలపై హైదరాబాద్‌లోని పహాడిషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో మరో ఫిర్యాదు నమోదైంది. మహేశ్వరం మండలం ఇమామ్‌గూడలో ఆరు ఎకరాలు కబ్జా చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. భూమి ఇచ్చి తీరాల్సిందేనంటూ తుపాకి గురిపెట్టి నయీమ్ అనుచరులు బెదిరించారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఆరు ఎకరాలు కబ్జా చేసి ఫంక్షన్ హాల్‌ను నిర్మించినట్లు చెప్పారు.