: లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బెంగళూరు కొరియో గ్రాఫర్ అరెస్ట్


తన వద్దకు డ్యాన్స్ నేర్చుకునేందుకు వచ్చే బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలపై బెంగళూరుకు చెందిన ఒక కొరియోగ్రాఫర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని కొప్పాల జిల్లాకు చెందిన హనుమేష్ ‘డ్రీమ్స్ డ్యాన్స్ అకాడమీ’ని నిర్వహిస్తున్నాడు. షికారిపురా, హోస్పేట్, బళ్లారి, మునీరాబాద్ లో డ్యాన్స్ క్లాసులు నిర్వహిస్తుంటాడు. టీవీ రియాల్టి షోలలో పాల్గొన దలచిన ఔత్సాహిక బాలికలు హనుమేష్ వద్ద డ్యాన్స్ లో శిక్షణ నిమిత్తం వస్తుంటారు. హనుమేష్ తమ పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, పిల్లలను అసభ్యకరంగా ఫొటోలు తీసి, డబ్బులివ్వమంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసినప్పటి నుంచి హనుమేష్ తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే, బళ్లారికి సమీపంలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న హనుమేష్ ను పోలీసులు నిన్న అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News