: నయీమ్ కేసుపై అధికారులతో ఏడు గంటల పాటు చర్చించిన సిట్ చీఫ్ నాగిరెడ్డి
తెలంగాణ పోలీసుల చేతిలో ఇటీవల హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. నయీమ్, అతడి అనుచరుల ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. నయీమ్ కేసుపై విచారణ జరిపించాల్సిందిగా ఐజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం స్సెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాదు, రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో ఈరోజు నయీమ్ కేసుపై నాగిరెడ్డి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సుమారు ఏడు గంటల పాటు సమావేశం కొనసాగింది. కాసేపట్లో నాగిరెడ్డి మీడియాతో మాట్లాడతారు. కేసులో వెలుగులోకొచ్చిన పలు విషయాలను వెల్లడించనున్నారు.