: గదుల కొరతతో ఇబ్బందులు పడుతున్న శ్రీవారి భక్తులు
గదుల కొరతతో తిరుమల తిరుపతి శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా సెలవులు రావడంతో ఆపదమొక్కులవాడిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో భక్తులకి గదులు దొరకడం లేదు. శ్రీవారి మెట్టు, అలిపిరి కాలినడక మార్గాల్లో వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంది. వైకుంఠం వెలుపల కిలోమీటరు మేర భక్తులు బారులుతీరి కనిపిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతోంది.