: ప్రజలను సంతృప్తి పరచడం మా పని.. జగన్ని కాదు: ఏపీ హోంమంత్రి చినరాజప్ప
ఆంధ్రప్రదేశ్లో కృష్ణా పుష్కర ఏర్పాట్లపై వైసీపీ గుప్పిస్తోన్న విమర్శల పట్ల ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలను సంతృప్తిపరచడమే తమ పనని, అంతేకాని వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని సంతృప్తిపరచడం తమ పని కాదని అన్నారు. పుష్కర ఏర్పాట్లపై భక్తులందరూ సంతృప్తి వ్యక్తం చేస్తుంటే, ప్రతిపక్ష నేత జగన్ మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పుష్కరాల ఏర్పాట్లపై ప్రతిపక్షానికి అన్నీ తప్పులే కనిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.