: ప్రియురాలిని తీసుకుని దలైలామాను కలసిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘ట్యూబ్ లైట్’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ లడక్ ప్రాంతంలో జరుగుతోంది. ‘ట్యూబ్ లైట్’ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ముగియడంతో తిరిగి ముంబయి చేరడానికి ముందు సల్మాన్, తన ప్రియురాలు లులియా వాంతూరుతో కలిసి బౌద్ధమత గురువు దలైలామాను కలిశాడు. దలైలామాకు ఒక వైపున ఉన్న సోఫాలో సల్మాన్, లులియాలు కూర్చోగా, మరో వైపు దలైలామా సహాయకులు ఉన్నారు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే, దలైలామాతో సల్మాన్ ఏం చర్చించారనే విషయం బయటకు రాలేదు. కాగా, కబీర్ ఖాన్ దర్శకత్వంలో సల్మాన్ నటిస్తున్న మూడో చిత్రం ‘ట్యూబ్ లైట్’. అంతకుముందు ఏక్ థా టైగర్, భజరంగీ భాయీ జాన్ చిత్రాల్లో నటించాడు.