: క్యాస్ట్రో పుట్టిన రోజుకు అభిమాని కానుక ప్రపంచం రికార్డు సృష్టించింది
ఒకప్పుడు అగ్ర రాజ్యం అమెరికాకు దడ పుట్టించిన క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో ఈరోజు 90వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హవానాకు చెందిన ఒక సీనియర్ చుట్టల తయారీదారుడు తన అభిమాన నేత కోసం ఒక బ్రహ్మాండమైక కానుకను సిద్ధం చేశాడు. క్యాస్ట్రోకు పనామా సిగార్ కాల్చడమంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆధారంగా చేసుకుని 90 మీటర్ల పొడవు ఉన్న అతి పెద్ద సిగార్ ను క్యాస్ట్రోకు కానుకగా సిద్ధం చేశాడు. క్యాస్ట్రోపై అభిమానంతో తయారు చేసిన ఆ సిగార్ ప్రపంచంలోనే అతిపెద్ద సిగార్ గా రికార్డు సృష్టించింది. కాగా, మార్కిస్టు-లెనినిస్టు భావాలతో పాటు క్యూబన్ జాతీయతను జోడించి క్యూబా కమ్యూనిస్ట్ పార్టీని క్యాస్ట్రో నాడు స్థాపించాడు. నాటి అమెరికా బటిస్టా ప్రభుత్వాన్ని విప్లవోద్యమం ద్వారా కూల్చివేసి క్యూబాలో అధికారాన్ని ఆయన హస్తగతం చేసుకున్నారు.