: అసోంలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇద్దరి మృతి
అసోంలో నిన్న రాత్రి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. తీన్సుకియా జిల్లాలోని భాబోన్ గ్రామంలో ఐదుగురు ఉగ్రవాదులు దాడికి దిగి ఇద్దరి ప్రాణాలను బలిగొన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పులకి పాల్పడింది ఉల్ఫా ఇండిపెండెంట్ గ్రూప్‌కి చెందిన ఉగ్రవాదులుగా పోలీసులు తెలిపారు. దాడిలో గాయపడ్డవారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. భాబోన్ గ్రామంలోనేగాక ఉగ్రవాదులు ఫిలోబారి వద్ద ఒక తేయాకు తోట డ్రెయిన్‌లో కూడా దాడులు జరిపారని, అక్కడ ఐఈడీని పేల్చారని పోలీసులు పేర్కొన్నారు. ఈ దాడిలో ఎవ్వరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు.