: రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోనున్న నయీమ్ అనుచరులు.. భారీగా పోలీసుల మోహరింపు
తెలంగాణ పోలీసుల చేతిలో ఇలీవలే హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. విచారణలో భాగంగా రాజేంద్రనగర్, పుప్పాలగూడలోని నయీమ్ ఇంటిని మరోసారి తనిఖీ చేయడానికి పోలీసులు అనుమతి కోరారు. ఈమేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నయీమ్ అనుచరులు ఫర్హానా, అప్సాను విచారించిన అనంతరం పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, పోలీసులకు ఇంతవరకు పట్టుబడని నయీమ్ అనుచరులు పలువురు కోర్టులో స్వచ్ఛందంగా లొంగిపోతారనే సమాచారంతో రాజేంద్రనగర్ కోర్టు వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టుకు వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కోర్టు ప్రాంగణంలో భారీగా పోలీసులని మోహరింపజేశారు.