: పెళ్లి చేసుకున్న యువహీరో బాలాదిత్య
యువహీరో బాలాదిత్య వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తాజ్ మహల్ హోటల్ లో ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ విషయాన్ని నటుడు శివబాలాజీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. బాలాదిత్య దంపతులతో కలిసి దిగిన ఒక ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా నవ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. కాగా, 'ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం' చిత్రంతో బాలనటుడిగా సినీ రంగం ప్రవేశం చేసిన బాలాదిత్య పలు చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత, 'చంటిగాడు' చిత్రంతో బాలాదిత్య హీరోగా రంగప్రవేశం చేశాడు. డబ్బింగ్ కళాకారుడు, వ్యాఖ్యాత, గేయ రచయిత కూడా అయిన బాలాదిత్య పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.