: బోయిన్ పల్లిలో కాల్పుల కలకలం!... కాంగ్రెస్ నేత యాదగిరిపై దుండగుల దాడి!


సికింద్రాబాదు పరిధిలోని బోయిన్ పల్లిలో కొద్దిసేపటి క్రితం కాల్పుల కలకలం రేగింది. కాంగ్రెస్ పార్టీ నేత యాదగిరిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు దిగారు. బోయిన్ పల్లిలోని మల్లికార్జున నగర్ లో చోటుచేసుకున్న ఈ ఘటనలో బైక్ పై వచ్చిన దుండగులు యాదగిరిపై కాల్పులు జరిపి రెప్పపాటులో అక్కడి నుంచి పరారయ్యారు. దుండగుల కాల్పుల్లో తీవ్ర గాయాలపాలైన యాదగిరిని పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News