: పాలిటిక్స్, సినిమా!... రెండు కోరికలు తీరకుండానే హతమైపోయిన గ్యాంగ్ స్టర్!


కరుడుగట్టిన నేరగాడిగా మారిన గ్యాంగ్ స్టర్ నయీమ్ తన చిరకాల వాంఛలు తీరకుండానే హతమైపోయాడు. గతవారం పాలమూరు జిల్లా షాద్ నగర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసుల బుల్లెట్లకు నయీమ్ హతమైన సంగతి తెలిసింది. ప్రభుత్వానికే పెను సవాల్ గా మారిన నయీమ్ అసలు రూపం, కార్యకలాపాల గుట్టు విప్పేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటిదాకా సేకరించిన కీలక ఆధారాల మేరకు నయీమ్ కు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో ఇంటరెస్టింగ్ పాయింట్ బయటకు వచ్చింది. రాజకీయాల్లోకి ప్రవేశించాలని తెగ ఆరాటపడిన నయీమ్... అందుకు వేదికను సిద్ధం చేసుకునే క్రమంలో ఓ తెలుగు చలన చిత్రాన్ని కూడా నిర్మించాలని భావించాడట. అది కూడా తన జీవిత చరిత్ర ఆధారంగానే తెరకెక్కించి సదరు చిత్రం ద్వారానే రాజకీయ తెరంగేట్రం చేయాలని అతడు ముమ్మర యత్నం చేశాడు. ఈ క్రమంలో అతడు పలువురు టాలీవుడ్ దర్శకులను కూడా కలిశాడట. ఈ యత్నాలు ముమ్మరంగా సాగుతున్న క్రమంలోనే అతడు గ్రేహౌండ్స్ బుల్లెట్లకు హతమైపోయాడు.

  • Loading...

More Telugu News