: నిన్నటితో పోలిస్తే ఆంక్షలు బాగా సడలించాం: ఏపీ డీజీపీ సాంబశివరావు
విజయవాడలో నిన్నటి పోలిస్తే ఆంక్షలు సడలించామని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. విజయవాడలోని అన్ని ఘాట్లను ఆయన ఈరోజు సందర్శించారు. కమాండ్ కంట్రోల్ కార్యాలయం నుంచి డీజీపీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేరుగా కొన్ని ఘాట్ల వరకు సిటీ బస్సులు వచ్చేట్లు ఆదేశాలు ఇచ్చామన్నారు. దుర్గ గుడికి వెళ్లే మార్గాల్లో రద్దీ లేనప్పుడు క్యూ లైన్లను సడలించామని చెప్పారు. గత అనుభవాల దృష్ట్యా తొలిరోజు భారీగా ఆంక్షలు విధించడం వాస్తవమేనని అన్నారు. ఆంక్షలను ఈరోజు నుంచి గరిష్ఠంగా సడలించామని డీజీపీ పేర్కొన్నారు.