: హైవేలపై భారీగా ట్రాఫిక్ జామ్!... నడిరోడ్లపై పుష్కర భక్తుల పడిగాపులు!


కృష్ణా పుష్కరాలకు తరలివస్తున్న అశేష భక్తజనంతో పుష్కర ఘాట్లకు దారి తీసే రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు తరలివస్తున్న నేపథ్యంలో హైదరాబాదు- విజయవాడ, హైదరాబాదు- కర్నూలు జాతీయ రహదారులపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామైంది. టోల్ ప్లాజాల వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఫలితంగా కృష్ణా నదిలో పుష్కర స్నానం చేసేందుకు తరలివస్తున్న భక్తులు నడిరోడ్లపై పడిగాపులు కాసే పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు చేస్తున్న యత్నాలు ఫలించడం లేదు.

  • Loading...

More Telugu News