: రియోలో భారత్ ఆశలు సజీవం!... సెమీస్ చేరిన సానియా- బోపన్న జోడి!


రియో ఒలింపిక్స్ లో ఏడు రోజులు దాటినా పతకాల వేటలో భారత్ బోణీ చేయలేకపోయింది. ఖాతా తెరుస్తుందన్న ఆశలు కూడా దాదాపుగా కనిపించడం లేదని సగటు భారతీయుడు తీవ్ర వేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో భారత్ ఖాతా తెరుస్తామంటూ హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, రాహుల్ బోపన్న జోడీ తెరపైకి వచ్చింది. మిక్స్ డ్ డబుల్స్ టెన్సిస్ విభాగంలో కొద్దిసేపటి క్రితం ముగిసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఈ జోడీ విజయం సాధించి సెమీస్ కి దూసుకెళ్లింది. ఆండీ ముర్రే- వాట్సన్ జోడీపై వీరు 6-4, 6-4 స్కోరు తేడాతో విజయం సాధించిన సానియా- బోపన్న జోడీ నేరుగా సెమీ ఫైనల్ చేరుకుని టైటిల్ కు మరో అడుగు దూరంలో నిలిచారు.

  • Loading...

More Telugu News