: నేను దేవుడ్ని కాదు...నాకు పాలాభిషేకాలు వద్దు...ఆ పాలు అనాధలకివ్వండి: జూనియర్ ఎన్టీఆర్
'నాన్నకు ప్రేమతో' సినిమా చేసినప్పుడు తన కటౌట్లకు పాలాభిషేకాలు చేసిన ఫోటోలు చూశానని గుర్తు చేశాడు. దయచేసి ఇలాంటి పనులు మానుకోవాలని' జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. తానేమీ దేవుడిని కాదని, తాను అభిమానులకు అన్నను, తమ్ముడను అని, అంతకు మించి సాధారణ మనిషినని స్పష్టం చేశాడు. తనను దేవుడ్ని చేయవద్దని సూచించాడు. తనకు పాలాభిషేకం చేయాలని అనుకున్న వారంతా ఆ పాలను అనాధ శరణాలయాలు లేదా ప్రసూతి ఆసుపత్రులకు దానమివ్వాలని సూచించాడు. ఒక వీడియోలో ఒక మూగజీవాన్ని బలిచ్చినట్టు చూశానని, ఇలాంటి తప్పుడు పనులు చేయవద్దని అభిమానులకు సూచించాడు. సినిమా అనేది ప్రాణాలు పోసేందుకు ఉద్దేశించినదని గుర్తు చేస్తూ... అలాంటి పనులు చేసే బదులు, అదే సినిమా హాలు వద్ద అన్నదానం చేయండని జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులను కోరాడు. అందరూ క్షేమంగా వెళ్లాలని సూచించాడు.