: తొలిసారి పెద్ద హీరోతో సినిమా చేస్తున్నాను: నిత్యామీనన్
తొలిసారిగా పెద్ద హీరోతో సినిమా చేస్తున్నానని నిత్యామీనన్ తెలిపింది. హైదరాబాదులోని శిల్పకళావేదికలో నిర్వహించిన 'జనతా గ్యారేజ్' ఆడియో వేడుకలో ఆమె మాట్లాడుతూ, తాను ప్రయాణాల్లో ఉండగా, తనను అభిమానులు కలిసినప్పుడు చాలా మంది, చాలా సార్లు జూనియర్ ఎన్టీఆర్ తో ఎప్పుడు సినిమా చేస్తున్నారని ప్రశ్నించేవారని తెలిపింది. వారి ఆశలు, తన కోరిక ఈ సినిమాతో తీరిపోయాయని నిత్యామీనన్ చెప్పింది. తనకు ఓ పెద్ద కమర్షియల్ సినిమాలో నటించాలనే కోరిక చాలా కాలంగా ఉండేదని వెల్లడించింది. ఈ సినిమాతో ఈ కోరిక నెరవేరిందని తెలిపింది. ఇంత మంచి అవకాశం కల్పించిన కొరటాల శివకు ధన్యవాదాలని తెలిపింది. ఒక పెద్ద సినిమా ఫంక్షన్ లో పాల్గొనడం ఇదే తొలిసారని నిత్యమీనన్ పేర్కొంది.