: మళ్లీ పుష్కరాలకు రాష్ట్రంలో కరవనేది లేకుండా చేస్తాం: సీఎం చంద్రబాబు
_6323.jpg)
మళ్లీ గోదావరి, కృష్ణా పుష్కరాలు వచ్చే సరికి రాష్ట్రంలో కరవనేది లేకుండా చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రాన్ని ప్రపంచం మొత్తానికి తిండి పెట్టే స్థాయికి తీసుకువెళతామన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ పుష్కరాల గురించి ఆలోచించాలని చంద్రబాబు పేర్కొన్నారు.