: జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ, దేవీశ్రీ ప్రసాద్ లపై నమ్మకం ఉంది: సుకుమార్


జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ లపై తనకు చాలా నమ్మకం ఉందని ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెలిపాడు. 'జనతా గ్యారేజ్' సినిమా ఆడియో వేడుకలో సుకుమార్ మాట్లాడుతూ, ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నాడు. అందరి అంచనాలను ఈ సినిమా అందుకుంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి మంచి సినిమాలు చాలా చేయాలని ఆయన ఆకాంక్షించాడు. అభిమానుల అండ ఉన్న ఎన్టీఆర్ కెరీర్లో ఇది మంచి సినిమా అవుతుందని చెప్పాడు.

  • Loading...

More Telugu News