: ఫయీమ్ దంపతులకు 14 రోజుల రిమాండ్... చర్లపల్లి జైలుకి తరలింపు
ఈ రోజు రాజేంద్రనగర్ కోర్టులో భార్య సాజిదాతో కలసి లొంగిపోయిన నయీమ్ ప్రధాన అనుచరుడు, సోదరుడు ఫయీమ్ కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఫయీమ్ దంపతులను చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. వీరితో పాటు మరికొందరిని కూడా రిమాండుకు పంపారు. ఈ సందర్భంగా సాజిదా, ఫరానా, అఫ్స తదితరుల వద్ద ఎక్కువ సమాచారం ఉందని, వారిని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరారు. దీనిపై విచారణను ఈ 16వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. అయితే నయీమ్ నేరాలపై ఫయీమ్ ను మీడియా ప్రశ్నించగా, నయీమ్ నేరాలతో తనకు సంబంధం లేదని, నయీమ్ గురించి తనకు పెద్దగా తెలియదని సమాధానమివ్వడం విశేషం.