: హైదరాబాద్‌లో వెట్టిచాకిరి నుంచి యువతికి విముక్తి.. మూడేళ్ల పాటు చాకిరీ చేసిన వైనం
మహబూబ్‌నగర్ జిల్లా ఇంజమూరుకు చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని ఓ వడ్డీ వ్యాపారి వద్ద మూడేళ్లుగా వెట్టి చాకిరీ చేస్తోంది. విషయాన్ని తెలుసుకున్న బాలల హక్కుల సంఘం నాయకులు ఈరోజు ఆమెకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించారు. నగరంలోని దోమలగూడలోని వడ్డీ వ్యాపారి బోజిరెడ్డి ఇంట్లో యువతి సమీనా పనిచేస్తోంది. వడ్డీ వ్యాపారి దగ్గర రూ.50 వేలు అప్పు తీసుకున్న సమీనా తండ్రి తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో సమీనాకు 14 ఏళ్లు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు (మూడేళ్లుగా) వడ్డీ వ్యాపారి వెట్టిచాకిరీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.