: సీతానగరం ఘాట్ వద్ద పోలీసుల ఓవరాక్షన్
గుంటూరు జిల్లాలోని సీతానగరం ఘాట్ వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారంటూ పుష్కర భక్తులు మండిపడుతున్నారు. పుష్కర స్నానాల అనంతరం కనకదుర్గమ్మ వారి దర్శనానికి వెళుతుంటే తమను అడ్డుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈరోజు దర్శనానికి వెళ్లడానికి వీలులేదని, రేపు ఉదయం దర్శనానికి వెళ్లాలంటూ భక్తులను తిరిగి పంపివేస్తున్నారని వారు వాపోతున్నారు. కాగా, దుర్గమ్మ వారి దర్శనం నిమిత్తం ఏర్పాటు చేసిన క్యూలు ఖాళీగా ఉన్నా భక్తులను ఎందుకు పంపించడం లేదనే విమర్శలు తలెత్తుతున్నాయి.