: ట్రంప్ భయపడుతూ, భయపెడుతున్నారు: హిల్లరీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ దూసుకుపోతున్నారు. అమెరికాలోని మిచిగాన్ లో నిర్వహించిన సభలో ట్రంప్ వ్యవహారశైలిని ఆమె తీవ్రంగా విమర్శించారు. ట్రంప్ నిత్యం భయపడుతూ, ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అమెరికాను వాణిజ్యరంగంలో పరుగులు పెట్టిస్తానంటున్న ట్రంప్ కు దేశ ఆర్థిక వ్యవస్థ, విదేశీ వాణిజ్యంపై ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. ట్రంప్ ప్రచారం మొత్తం భయం ఆధారంగానే సాగుతోందని ఎద్దేవా చేశారు. ఇలా ప్రతిదానికి భయపడుతూ పోతే అమెరికా మనుగడ కష్టమని, అమెరికా ఘనత చరిత్రగా మారిపోతుందని ఆమె తెలిపారు. ట్రంప్ లా అమెరికన్లు భయపడితే ఇంట్లో దాక్కోవాల్సిందేనని అన్నారు. ట్రంప్ విధానాలను ఆయన సొంత పార్టీయే అంగీకరించడం లేదని ఆమె పేర్కొన్నారు.