: కేరళీయులే నిజమైన ఇండియన్స్: హల్ చల్ చేస్తున్న మార్కండేయ కట్జూ వ్యాఖ్యలు
కేరళలోని ప్రజలే నిజమైన భారతీయులంటూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టిన ఓ పోస్టు హల్ చల్ చేస్తూ, కేరళ యువత నుంచి లైకుల మీద లైకులు తెచ్చుకుంటోంది. "ఇండియన్స్ కు ఉండాల్సిన సహజ లక్షణాలెన్నో కేరళ వాసుల్లో కనిపిస్తాయి. కలుపుగోలుతనం, సామరస్యత వారిలో అధికం. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తూ సాగడాన్ని అక్కడ చూడవచ్చు. వారి విశాల దృక్పథాన్ని దేశ ప్రజలంతా అవలంబించాలి" అని పోస్టు పెట్టగా, కేరళ వాసులు అమితానందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కట్జూ పోస్టుకు 21 వేలకు పైగా లైక్స్, 14 వేలకు పైగా షేర్స్ వచ్చాయి. కాగా, కేరళ వాసుల కన్నా మరింత కలుపుగోలుగా ఉండే ఈశాన్య రాష్ట్రాల ప్రజల గురించి ఆయన మాటమాత్రమైనా చెప్పకపోవడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు.