: బులంద్‌షెహ‌ర్‌ సామూహిక అత్యాచారం కేసులో సీబీఐ విచారణకు ఆదేశం


ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బులంద్‌షెహ‌ర్‌లో త‌ల్లీకూతుళ్ల‌పై సామూహిక అత్యాచారం జ‌రిగిన ఘ‌ట‌న‌పై అల‌హాబాద్ హైకోర్టు ఈరోజు సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించింది. త‌ల్లీకూతుళ్ల‌పై ఓ దొంగ‌ల ముఠానే ఈ అఘాయిత్యానికి పాల్ప‌డింద‌ని భావిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప‌లువురు నిందితుల కోసం పోలీసులు భారీ ఎత్తున రంగంలోకి దిగి గాలిస్తున్నారు. నోయిడా ర‌హ‌దారిపై త‌ల్లితో పాటు ఆమె మైన‌ర్ కూతురిపై గ‌త నెల 29 (శుక్ర‌వారం) న రాత్రి అత్యాచారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. హైవేపై కారులో వెళుతోన్న‌ కుటుంబ సభ్యులను అటకాయించి, వారిలో మగవారిని బంధించి, వారి ఎదురుగానే త‌ల్లీకూతుళ్లను వాహ‌నంలోంచి బ‌య‌ట‌కు లాగిప‌డేసి ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ్డారు.

  • Loading...

More Telugu News