: జూడోలో స్వర్ణం సాధించాడు...రిసెప్షనిస్ట్ చేతిలో తన్నులు తిన్నాడు!


బ్రెజిల్ క్రీడాకారుడు డిర్క్ వాన్ టిచెల్ట్ (32) 72 కిలోల జూడో విభాగంలో ఒలింపిక్స్ రజత పతకం సాధించాడు. ఈ ఆనందంలో పార్టీ చేసుకుంటుండగా, అతని స్నేహితుడి మొబైల్ ను ఓ దొంగ ఎత్తుకుపోగా, వెంబడించి అతని చేతిలో దెబ్బలు తిన్నాడన్న వార్తా కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి అతనికి చేదు అనుభవం ఎదురైంది దొంగ చేతిలో కాదు. ఓ హోటల్ రిసెప్షనిస్ట్ అయిన మహిళ చేతిలో! జూడో ఛాంపియన్ ను మహిళ కొట్టిందా? అన్న అనుమానం వచ్చిందా? అయితే చదవండి... రజతపతకం గెలిచిన ఆనందంలో ఉన్న డిర్క్ వాన్ టిచెల్ట్ ఇద్దరు స్నేహితులు, ట్రైనర్ తో కలిసి పార్టీ చేసుకునేందుకు బీచ్ ఒడ్డుకు వెళ్లాడు. అక్కడ పార్టీ చేసుకుంటుండగా, అతని ట్రైనర్ జేబులోంచి స్మార్ట్ ఫోన్ ను ఓ యువతి కొట్టేసింది. వెంటనే ఆమెను టిచెల్ట్ వెంబడించాడు. ఆమె నేరుగా దగ్గర్లో ఉన్న బెస్ట్ వెస్ట్రర్న్ ప్లస్ హోటల్ లోకి దూరిపోయింది. దీంతో ఆమెను వెంబడిస్తూ వస్తున్న టిచెల్ట్ ను హోటల్ రిసెప్షనిస్ట్ చూసింది. మహిళను ఎందుకు వెంబడిస్తున్నావంటూ అడ్డుకుని, నిలదీసింది. అసలే జూడో ఛాంపియన్, పతకం గెలిచిన జోరులో ఉన్నాడు. తన కండలు తిరిగిన నైపుణ్యం ముందు ఆమె ఎంత అనుకున్న టిచెల్ట్ రిసెప్షనిస్టును తేలికగా తీసుకుని, ఆమెను నెట్టేసి హోటల్ లోకి వెళ్దామని ప్రయత్నించాడు. అంతే.. కళ్ల బైర్లు కమ్మే పంచ్ ఒక్కటి తగిలింది. దీంతో అతని కళ్లు మసకబారాయి. దిమ్మదిరిగింది. కంటిచుట్టూ నల్లగా కమిలిపోయింది. ఆ తరువాత అతనికి ఆ మహిళా రిసెప్షనిస్ట్ బ్రెజిల్ మార్షల్ ఆర్ట్స్ గా పేరొందిన జుజిత్సు నిపుణురాలనే వాస్తవం తెలిసింది. దీంతో మౌనంగా అక్కడి నుంచి బయటకి వచ్చేశాడు. ఈ విషయాన్ని అక్కడి ప్రత్యక్ష సాక్షులు బయటి ప్రపంచానికి తెలిపారు.

  • Loading...

More Telugu News