: ట్విట్టర్ ను మూసివేయబోము: స్పష్టం చేసిన యాజమాన్యం


సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ ను 2017లో మూసివేయనున్నారంటూ వస్తున్న వార్తలపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేయగా, దీనిపై యాజమాన్యం స్పందించింది. నిరాధారమైన వార్తలను చూసి అపోహపడవద్దని, ట్విట్టర్ ను మూసి వేయడం లేదని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. "ఆన్ లైన్ వేధింపులను ట్విట్టర్ ఆపలేకపోతున్నందున ట్విట్టర్ ను మూసేస్తున్నారు" అని ఓ కస్టమర్ ట్వీట్ చేయగా అది వైరల్ అయినట్టు గమనించామని, దీనిపై లక్షల మంది స్పందిస్తూ, మైక్రో బ్లాగింగ్ సైట్ మూసివేత కూడదని రిక్వెస్ట్ లు పెడుతున్నారని ఆయన చెప్పారు. వేధింపుల ఆరోపణలు వస్తే వారి ఖాతాలను ట్విట్టర్ సస్పెండ్ చేస్తూ వెళుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News