: వస్త్ర వ్యాపారులకు సర్కారు శుభవార్త


ఎన్నాళ్ళ నుంచో వ్యాట్ ఎత్తివేయాలంటూ ఉద్యమిస్తోన్న వస్త్ర వ్యాపారులకు తీపి కబురు. వ్యాట్ ఎత్తివేస్తూ నేడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యాహ్నం మంత్రి వర్గ ఉపసంఘం వస్త్ర వ్యాపారులతో సమావేశం అయింది. వారి డిమాండ్ల పట్ల సానుకూల ధోరణితో చర్చించింది. భేటీ అనంతరం తుది నిర్ణయం సీఎంకే వదిలేశామని మంత్రి ఆనం చెప్పారు. ఈ నేపథ్యంలో వస్త్రాలపై వ్యాట్ తొలగించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్ది నిర్ణయం తీసుకున్నారని మరో మంత్రి టీజీ వెంకటేశ్ తెలిపారు.

  • Loading...

More Telugu News