: హీరో విశాల్ తో ఉన్న ఆ ఇద్దరు భామలు వీరే!


దక్షిణాది హీరో విశాల్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘కత్తి సందాయ్’. సురాజ్ దర్శకత్వం వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను హీరో విశాల్ ఇటీవల విడుదల చేశాడు. అయితే, ఆ ఫస్ట్ లుక్ లో భరతనాట్యం దుస్తుల్లో ఉన్న ఇద్దరు మహిళల మధ్య టక్ చేసిన ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. ఆ మధ్యలో ఉన్న వ్యక్తి హీరో విశాల్ అని అభిమానులు గెస్ చేయగలిగినా, మిగిలిన ఇద్దరు అమ్మాయిలు ఎవరనేది సస్పెన్స్ క్రియేట్ చేసింది. ఈ నెల 12వ తేదీన అంటే ఈ రోజున ఆ సస్పెన్స్ కు తెరతీస్తానని హీరో విశాల్ గతంలో చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే ముగ్గురూ కనిపించే విధంగా మరో ఫొటోను ఈ రోజు విడుదల చేశాడు. విశాల్ కు రెండు వైపులా నిల్చుని ఉన్న ఆ ఇద్దరు ఎవరంటే, ఒకరు హీరోయిన తమన్నా కాగా, మరొకరు నటుడు సూరి. ఈ అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో నటుడు జగపతిబాబు, హస్యనటుడు వడివేలు తదితరులు నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News