: మద్యం తాగి విమానం నడిపిన ఇద్దరు పైలట్లపై సస్పెన్షన్ వేటు
మద్యం తాగి విధినిర్వహణలో పాల్గొన్న ఇద్దరు ఎయిరిండియా, జెట్ ఎయిర్‌వేస్ పైలట్లపై ఈరోజు సస్పెన్షన్ వేటు పడింది. విదేశాల నుంచి వచ్చిన విమానాల పైలట్లకు అధికారులు ఆల్కహాల్ టెస్టు చేశారు. ఈ పరీక్షలో ఇరువురు పైలట్లు మద్యం తీసుకున్నట్టు తేలడంతో సంబంధిత అధికారులు వారిపై నాలుగేళ్ల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. ఇరువురు పైలట్లపై విమానయాన మంత్రత్వశాఖ ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలు జారీ చేసింది.