: గుంటూరు జిల్లాలో ఇద్దరు మహిళలపై కత్తితో దాడి
గుంటూరు జిల్లా నాదెండ్లలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి హల్‌చల్ చేశాడు. ఇద్దరు మహిళలపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి గాయపరిచాడు. బాధిత మహిళలను స్థానికులు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దాడిచేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. నిందితుడి పేరు నినోద్ కుమార్‌గా పేర్కొన్నారు. దాడి చేయడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.