: భువనగిరిలో ఇద్దరు నయీమ్ అనుచరుల అరెస్ట్
పోలీసుల ఎన్ కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈరోజు నల్గొండ జిల్లాలో పోలీసులు విస్తృతంగా సోదాలు జరిపారు. జిల్లాలోని భువనగిరిలో తలదాచుకున్న నయీమ్ అనుచరులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. పట్టుబడ్డ వారి పేర్లు కుమారస్వామి, రేవెల్లి శ్రీనివాస్ అలియాస్ రమేశ్‌లుగా పోలీసులు పేర్కొన్నారు. తమ సోదాలను పోలీసులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.