: ఫిలిప్పీన్స్‌ జైల్లో పేలుడు.. మంట‌లు వ్యాపించి 10 మంది ఖైదీల స‌జీవ‌ద‌హ‌నం


ఓ జైల్లో భారీ పేలుడు సంభ‌వించి 10 మంది ఖైదీలు మృత్యువాతప‌డ్డ ఘ‌ట‌న ఫిలిప్పీన్స్‌లోని పరాంకే నగరంలో చోటుచేసుకుంది. ఈరోజు ఉద‌యం 8.30 గంట‌ల‌కి ఈ పేలుడు సంభ‌వించింది. జైల్లో వార్డెన్ ఆఫీసులోని మొదటి అంతస్తులో పేలుడు సంభ‌వించ‌డంతో భారీగా మంట‌లు వ్యాప్తించాయి. దీంతో 10 మంది ఖైదీలు స‌జీవ‌ద‌హ‌నం కాగా జైలు వార్డెన్‌కి తీవ్ర‌గాయాలయ్యాయి. వార్డెన్‌ని అక్క‌డి సిబ్బంది ఆసుపత్రికి త‌ర‌లించారు. పేలుడు ఘ‌ట‌న‌పై అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News