: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం...ఏడుగురి మృతి
తమిళనాడులో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చిలో బస్సు-వ్యాను ఢీ కొని ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో 15 మందికి గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు-వ్యాను ఎదురెదురుగా వేగంగా రావడంతో ఒకదానినొకటి ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు గాయాలపాలయిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. స్థానికులను ఆరా తీసి, ప్రమాదం జరగడానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.