: రాజ్యసభ నిరవధిక వాయిదా.. మొత్తం 112 గంటల పాటు సభ
రాజ్యసభ వర్షాకాల సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. మొత్తం 112 గంటల పాటు సభ జరిగిందని రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ఈ సందర్భంగా సభలో తెలిపారు. స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో చేపట్టిన అతిపెద్ద ఆర్థిక సంస్కరణ దిశగా ముందడుగు పడి చారిత్రాత్మక జీఎస్‌టీ బిల్లుకి ఈ సమావేశాల్లోనే ఆమోదం జరిగిన విషయం తెలిసిందే. సమావేశాల్లో కశ్మీర్ అంశంలో యుద్ధవాతావరణమే కనిపించింది. దళితులపై జరిగిన దాడుల అంశంలో ప్రతిపక్షాలు కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టాయి. ఈ రాజ్యసభ సమావేశాల్లో అరుణ్‌జైట్లీ ఇచ్చిన సమాధానంతో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా రాదన్న విషయం మరోసారి స్పష్టమైపోయింది. ఎన్నో పార్టీలు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాకు మద్దతు తెలిపినా హోదాపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు.