: జోనల్ విధానం ఉండాల్సిందేనని కొందరు... వద్దని కొందరు... ఉపాధ్యాయ సంఘాల భిన్నాభిప్రాయాలు !
మెదక్ జిల్లాలో ఈరోజు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. దీనిపై ప్రధానంగా జోనల్ విధానంపై చర్చించారు. అయితే, జోనల్ విధానం కొనసాగించాలని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరితే, ఎత్తివేయాలని మరికొన్ని ఉపాధ్యాయ సంఘాలు విన్నవించుకున్నాయి. ఇక, స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు జరగాలని ఉద్యోగ సంఘాలు భేటీలో కోరాయి. ఉద్యోగులకు ఆప్షన్లకు అవకాశమివ్వాలని కోరాయి. కమలనాథ్ కమిటీలాగే ఓ కమిటీ ఏర్పాటు చేసి, ఉద్యోగుల ఆప్షన్ల ప్రక్రియకు అవకాశమిచ్చి ఉద్యోగులను విభజించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.