: షారూక్ కు క్షమాపణలు చెప్పిన యూఎస్ అసిస్టెంట్ సెక్రటరీ


బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ కు అమెరికాలో మరోసారి అవమానం జరిగిందన్న వార్తలపై ఆయన అభిమానులు తీవ్రంగా మండిపడుతున్న వేళ, అమెరికా ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. "ఎయిర్ పోర్టులో జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. అమెరికన్ పౌరులపై సైతం నిఘాను అధికంగా పెట్టాల్సిన పరిస్థితి ఉంది" అని సౌత్ అండ్ సెంట్రల్ ఆసియా వ్యవహారాలను పర్యవేక్షిస్తుండే యూఎస్ అసిస్టెంట్ సెక్రటరీ నిషా బిస్వాల్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. నాలుగు గంటల పాటు అతన్ని ప్రశ్నించడం తప్పేనని అంగీకరించారు. షారూక్ వస్తున్నారన్న సమాచారం ముందుగా ఇచ్చివుంటే, ఈ పరిస్థితి రాకుండా చూసేవాళ్లమని చెప్పారు.

  • Loading...

More Telugu News