: నిండుకుండలా శ్రీశైలం జలాశయం!... 150 టీఎంసీలకు పైగా చేరిన నీరు!
కృష్ణా నది పుష్కర శోభను సంతరించుకున్న సందర్భంగా ఆ నదిపై ఉన్న శ్రీశైలం జలాశయం నిండుకుండా కళకళలాడుతోంది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వరదల కారణంగా జలాశయానికి ఇంకా పెద్ద ఎత్తున నీరు చేరుతోంది. నేటి ఉదయం 8 గంటల సమయానికి జలాశయంలో 150.81 టీఎంసీల నీరు చేరింది. ఇప్పటికీ జలాశయానికి 2,30,120 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 81,013 క్యూసెక్కుల నీటిని అధికారులు కిందకు వదులుతున్నారు. ఈ క్రమంలో జలాశయంలో నీటి మట్టం 872.1 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 కాగా... ఇదే తరహాలో ఇన్ ఫ్లో కొనసాగితే త్వరలోనే జలాశయం పూర్తిగా నిండుతుంది.