: కరుడుగట్టిన నేరస్తుడే అయినా... 'శాండో, కోమి' శునకాలంటే నయీమ్ కు అమిత ప్రేమ!


ఓ పక్క సెటిల్ మెంట్లు, మరో పక్క అనుచరులతో దాడులు, హత్యలు చేయిస్తుండే కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీమ్ కు శునకాలంటే అమిత ప్రేమని తెలుస్తోంది. అల్కాపురి టౌన్ షిప్ లోని తన ఇంట రెండు శునకాలను పెంచుతున్న నయీమ్, వాటిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడని అధికారులు గుర్తించారు. ఎంతమాత్రం వాసన మారినా గుర్తించడంతో పాటు చిన్నపాటి కదలికలు సైతం పసిగట్టే డాల్మెంటైన్ జాతికి చెందిన రెండు శునకాలను పెంచుకుంటున్నాడు. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు ఈ తరహా శునకాలను పహారా నిమిత్తం వాడుతుంటారు. వీటికి శాండో, కోమి అని పేర్లు పెట్టుకున్న నయీమ్, ఈ రెండు కుక్కల ఆరోగ్యం కోసం ప్రత్యేక జంతు వైద్యుడిని పెట్టుకున్నాడు. ఆహార నియమాల్లో తేడాలు రాకుండా, ఎప్పుడు ఏం పెట్టాలన్న విషయమై బోర్డు రాయించి తగిలించాడు. ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రత్యేక బోన్ లో ఉండే ఇవి రాత్రిపూట ఎంతో జాగ్రత్తగా ఇంటిని కాపలా కాస్తుండేవని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News