: గూఢచారి ఆరోపణలతో పాక్ జైలులో 18 ఏళ్లు శిక్ష అనుభవించిన భారతీయుడి మృతి


భారత గూఢచారి అన్న ఆరోపణలతో పాకిస్థాన్‌లో అరెస్టై 18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన రాహి(60) ఈ రోజు మృతి చెందాడు. పంజాబ్‌లోని ఖేహ్రా గ్రామానికి చెందిన రాహిని గూఢచారి అని ఆరోపిస్తూ పాకిస్థాన్ అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించింది. 2005లో విడుదలైన ఆయన ఈ రోజు స్వగ్రామంలో మృతి చెందారు. అయితే ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకునేంత వరకు అంత్యక్రియలు నిర్వహించే ప్రసక్తే లేదని కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు. రాహి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, బాధిత కుటుంబానికి సాయం అందించాలని బాధిత కుటుంబ సభ్యులు చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సౌరభ్ అరోరా తెలిపారు.

  • Loading...

More Telugu News