: న్యూకెలడోనియాలో భారీ భూకంపం.. సునామీ భయం లేదన్న అధికారులు


న్యూ కెలడోనియాను భారీ భూకంపం కుదిపేసింది. శుక్రవారం 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే సునామీ గురించి భయడాల్సిన పనిలేదని భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నారు. న్యూ కెలడోనియాలోని లీ హంటర్‌ తీరానికి 109 కిలోమీటర్ల దూరంలో సముద్రానికి 9 కిలోమీటర్ల అడుగున భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో భూకంపాలు రావడం చాలా అరుదని జియోసైన్స్ ఆస్ట్రేలియా సీనియర్ భూకంప శాస్త్రవేత్త ఫిల్ క్యుమిన్స్ పేర్కొన్నారు. ఈ భూకంపంతో భారీ నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పారు. అయితే ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు.

  • Loading...

More Telugu News