: గోదావరి జీవనాడి!... కృష్ణమ్మ ప్రాణనాడి!: పుష్కరాల సందర్భంగా చంద్రబాబు కామెంట్స్!
పవిత్ర కృష్ణా పుష్కరాల ప్రారంభం సందర్భంగా కొద్దిసేపటి క్రితం విజయవాడలో మీడియాతో మాట్లాడిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరిని జీవనాడిగా అభివర్ణించిన ఆయన... కృష్ణా నదిని ప్రాణనాడిగా పేర్కొన్నారు. నిన్న రాత్రి 9.28 గంటలకు పుష్కరుడికి ఆహ్వానం పలికామని ఆయన పేర్కొన్నారు. గోదావరికి అఖండ హారతి, కృష్ణమ్మకు పవిత్ర హారతి కొనసాగిస్తున్నామన్నారు. రెండు పుష్కరాలు నిర్వహించే అవకాశం గతంలో ఏ ఒక్క ముఖ్యమంత్రికి రాలేదన్నారు. వచ్చే పుష్కరాల నాటికి నదుల అనుసంధానం పూర్తి కావాలని ఆయన అభిలషించారు. నదుల అనుసంధానం భాద్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ ఏడాది రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలని సంకల్పించామని ఆయన చెప్పారు.