: చైనా పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 21 మంది దుర్మరణం
చైనా పవర్‌ప్లాంట్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. హుబేయి ప్రావిన్స్‌లోని డాంగ్‌యాంగ్ నగరంలో ఉన్న మేడియన్ గాంగ్వూ పవర్ జనరేషన్ కంపెనీలో హైప్రెజర్ స్టీమ్ పైపు గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో 21 మంది అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. పేలుడు వెనుక గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.