: ఒలింపిక్స్‌లో క్వార్టర్స్‌కు భారత పురుషుల హాకీ జట్టు... 36 ఏళ్ల తర్వాత తొలిసారి
భారత క్రీడాభిమానులకు శుభవార్త. ఎనిమిదిసార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం ఎగరేసుకుపోయిన భారత హాకీ జట్టు 36 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. వరల్డ్ నెంబర్-2 నెదర్లాండ్స్ చేతిలో 1-2తో భారత్ పరాజయం పాలైనప్పటికీ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉండడంతో భారత్‌కు ఈ అవకాశం దక్కింది. నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి భారత జట్టు ఆరు పాయింట్లతో ఉంది. నెదర్లాండ్స్, జర్మనీ పది, అర్జెంటీనా ఏడు పాయింట్లతో కొనసాగుతున్నాయి. ఈ రోజు భారత్ జట్టు కెనడాతో తలపడనుంది. ఇదిలా ఉంచితే, 1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్స్‌లో హాకీలో భారత్ క్వార్టర్‌కు చేరింది.