: బెజవాడలో చంద్రబాబు, గొందిమళ్లలో కేసీఆర్ పుష్కర స్నానం!


తెలుగు రాష్ట్రాల్లో నేటి తెల్లవారుజామున మొదలైన కృష్ణా పుష్కరాల్లో భాగంగా ప్రారంభ సమయంలో లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలకు పోటెత్తారు. ఏపీలో కొనసాగుతున్న పుష్కరాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని దుర్గా ఘాట్ కు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన చంద్రబాబు... పుష్కరుడికి హారతి ఇచ్చి పుష్కర స్నానమాచరించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు పుష్కర స్నానం చేశారు. మరోవైపు తెలంగాణలో పుష్కరాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించారు. మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గ పరిధిలోని గొందిమళ్ల పుష్కర ఘాట్ కు వచ్చిన ఆయన అక్కడ పుష్కర స్నానం చేశారు. కేసీఆర్ వెంట ఆ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News