: బోయపాటి సారధ్యంలో... బాలయ్య ప్రత్యేక ఆకర్షణగా...సకుటుంబ సపరివార సమేతంగా చంద్రబాబు కృష్ణా పుష్కరపూజలు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని పవిత్రసంగమం ఫెర్రీ రేవు వద్ద ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను సారధ్యంలో రూపుదిద్దుకున్న నమూనా దేవాలయాలను ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సకుటుంబ సపరివార సమేతంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోయపాటి ఏర్పాటు చేసిన లేజర్ షో ఆకట్టుకుంది. పవిత్ర సంగమం వద్ద గురుడు కన్యారాశిలో ప్రవేశించిన వేళ పుష్కరుడు కృష్ణా నదిలో ప్రవేశించే ముహూర్తానికి వేద మంత్రోచ్చారణ నడుమ హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ వ్యాఖ్యానంతో పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాగా, రేపు ఉదయం సీఎం చంద్రబాబుతో కలిసి బాలకృష్ణ, కుటుంబ సభ్యులు పుష్కరస్నానం ఆచరించనున్నారు.

  • Loading...

More Telugu News