: శోభాయాత్రతో ప్రారంభమైన కృష్ణా పుష్కరాల వేడుక


విజయవాడలో శోభాయాత్రతో కృష్ణా పుష్కరాల వేడుక ప్రారంభమైంది. ఈ వేడుకను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. వేదపండితులు, వేల మంది కళాకారులతో ఘనంగా శోభాయాత్రను ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం నుంచి పవిత్ర సంగమం వరకు ఈ శోభాయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ ను మళ్లించారు. కాగా, గుంటూరులో కూడా పుష్కర శోభాయాత్రను నిర్వహించారు. గుంటూరు కలెక్టరేట్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు సుమారు రెండు కిలోమీటర్ల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

  • Loading...

More Telugu News