: మిమ్మల్ని సినిమాల్లో చూశాను...ఇప్పుడు రాజ్యసభలో చూస్తున్నాను...అభినందనలు: సురేశ్ గోపీతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్


మలయాళ సినిమాలు చూసిన వారికి సినీ నటుడు సురేశ్ గోపి తెలిసే ఉంటారు. పోలీస్ పాత్రల్లో తనదైన శైలి అభినయంతో టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లలో సురేశ్ గోపీ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. భారీ డైలాగులు చెప్పి, యాక్షన్ సీన్స్ తో విలన్ పీచమణిచే హీరోగా సురేష్ గోపీకి మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి గోపీని పార్లమెంటులో నివేదిక సమర్పించడం చూసిన డిప్యూటీ ఛైర్మన్ కురియన్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మిమ్మల్ని సినిమాల్లో చూశాను...ఇప్పుడు రాజ్యసభలో నివేదిక సమర్పించడం చూస్తున్నాను...తొలి సమావేశాల్లోనే నివేదిక సమర్పించడం పట్ల అభినందనలు' అన్నారు. దీంతో సభలో సభ్యులంతా బల్లలు చరిచి ఆయనను అభినందించారు. అనంతరం సురేశ్ గోపీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి సంబంధించి స్టాండింగ్‌ కమిటీ నివేదిక సమర్పించారు. కేరళలో బీజేపీ ప్రచారకర్తగా పనిచేసిన సురేశ్ గోపీ పార్టీ పరాజయం పాలైనప్పటికీ గత ఏప్రిల్ లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

  • Loading...

More Telugu News